![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -900 లో.. మహేంద్ర సర్ ని ఒంటరిగా వదిలి పెట్టవద్దని రిషితో వసుధార అంటుంది. అయితే అలా చెప్పేటప్పుడు రిషిని వసుధార సర్ అని పిలవడంతో.. పక్కనే ఉన్న మహేంద్ర.. ఏం అన్నావ్? రిషి నీ భర్త.. సర్ ఏంటి సర్. భర్తని ఏమని పిలవాలి, అలాగే పిలువమని అంటాడు. ఏవండీ అని పిలువు లేదా రిషి అని పిలువు అని మహేంద్ర అనగానే.. సర్ ఇప్పుడు నేను అలా పిలవలేను అని వసుధార అనగానే సరే నిన్ను ఇబ్బంది పెట్టను. నన్ను మాత్రం మామయ్య అని పిలువమని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్రని మామయ్య అని పిలుస్తుంది వసుధార.
ఆ తర్వాత ఈ ఒక్క రోజు మీరు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి. రేపు కలిసి వెళదామని మహేంద్ర అంటాడు. లేదు మామయ్య మీరు రండి అని వసుధార అంటుంది. లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళను. మీరు వచ్చేవరకు ఇక్కడే ఉంటానని మహేంద్ర అనగానే.. రిషి, వసుధార ఇద్దరు అక్కడ నుండి వెళ్తారు. ఆ తర్వాత మహేంద్ర జగతిని గుర్తుకుచేసుకొని.. నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా జగతి అని అంటాడు. మరొక వైపు రిషి, వసుధారలు ప్రేమ పక్షుల లాగా సరదాగా బయటకు వెళ్తారు. అలా అన్ని ప్లేస్ లు తిరుగుతు ఒక వాటర్ ఫాల్ దగ్గర ఆగుతారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరొక వైపు అసలు రిషి వాళ్ళు ఎక్కడికి వెళ్లారని శైలేంద్ర ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ వసుధార లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారో చెప్పకుండా వసుధార పొగరుగా సమాధానం చెప్తుంది. దాంతో ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందని శైలేంద్ర కోపంగా ఉంటాడు. ఆ తర్వాత భోజనం చేస్తుండగా.. ఫణీంద్ర ద్వారా రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ట్రై చేస్తుంది దేవయాని. కానీ ఫణీంద్ర వాళ్ళ గురించి చెప్పకుండా దేవయాని కి కౌంటర్ వేస్తాడు.
మరొక వైపు వసుధార ఒంటరిగా బయట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు తాగుబోతులు వసుధార దగ్గరకు వస్తారు. దాంతో మహేంద్ర వచ్చి వాళ్ళని కొడతాడు. ఆ తర్వాత శైలేంద్ర కాల్ చేశాడని మహేంద్రకి వసుధార చెప్తుంది. శైలేంద్ర చేసే కుట్రల గురించి ఎలాగైనా సాక్ష్యాలతో రిషికి చూపించాలని మహేంద్ర, వసుధార మాట్లాడుకుంటారు. అప్పుడే రిషి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |